గచ్చిబౌలి(నమస్తే శేరిలింగంపల్లి): టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడి, అప్పులపాలైందని, రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డీకే. అరుణ అన్నారు. మంగళవారం గచ్చిబౌలి డివిజన్ బీజేపీ అభ్యర్థి గంగాధర్ రెడ్డి కి మద్దతుగా నియోజకవర్గ నాయకులు ఎం.రవికుమార్ యాదవ్ తో కలిసి రాయదుర్గంలో రోడ్ షో నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ లో కుటుంబ పాలన సాగుతోందని, ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కేటీఆర్ లు ప్రజా సంక్షేమాన్ని విడిచి కుటుంబ ప్రయోజనాలకోసం పరిపాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో టీఆరెస్ పార్టీకి ఓటు వేస్తె మజ్లీస్ నాయకులు మేయర్ అవుతారని, ఈ విషయాన్నీ ప్రజలు గమనించాలని సూచించారు. గచ్చిబౌలి డివిజన్ అభ్యర్థి గంగాధర్ రెడ్డి కి ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






