బాలకృష్ణ పబ్లిక్ పాఠశాలలో స్పోర్ట్స్ మీట్ 2025

శేరిలింగంపల్లి, డిసెంబ‌ర్ 21 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని భూదేవి హిల్స్ కాలనీలో ఉన్న బాలకృష్ణ పబ్లిక్ పాఠశాలలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ 2025 కార్యక్రమంలో కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ బాలకృష్ణ పబ్లిక్ పాఠశాలలో నిర్వహించిన క్రీడా మహోత్సవం (స్పోర్ట్స్ మీట్) చాలా అభినందించదగ్గ విషయం అని, టగ్ ఆఫ్ వార్, త్రో బాల్, ఖోఖో, క్రికెట్, రన్నింగ్ వంటి ఆటలు నిర్వహించడం జరుగుతుంద‌న్నారు. పిల్లల‌కు చదువులతో పాటు ఆటలు చాలా కీలకం అని , పిల్లలలో దాగిన సృజనాత్మకత ను బయటకి వెలికి దీయడానికి ఎంతగానో తోడ్ప‌డుతుంద‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, మంత్రిపగడ సత్యనారాయణ, నాయి నేనీ చంద్రకాంత్ రావు, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here