శేరిలింగంపల్లి, డిసెంబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ సీనియర్ జర్నలిస్ట్ , కవి రచయిత మోటూరి నారాయణరావుకు లేఖ సాహిత్య రత్న అవార్డు పురస్కారం లభించింది . నగరంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజస్ సంస్థ ప్రాంగణంలో జరిగిన లేఖ ఆన్యూవల్ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో సమాజ సేవకులు, సాహితీ వేత్తలకు అవార్డుల ప్రధాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బోర్డు సభ్యుడు , ఆల్ ఇండియా శిష్టకరణ సంఘం అధ్యక్షుడు డివీ కృష్ణారావు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నాయకులు పోలుహమంతి ఉమామహేశ్వరరావు, అక్కుమహంతి రాజా, ఇతర రాష్ట్రాల నాయకులు, లేఖ టీ ప్రతినిధులు జేవీ చంద్రబాబు, మంత్రి నరసింహ రావు, ఎస్.నరహరినాధ్, దశమంత్రి నరేశ్, ప్రముఖ సాహితీ వేత్తలు శేఖరమంత్రి, సదాశివుని లక్ష్మణ రావు సమక్షంలో సాహితీ చైతన్య కిరణాలు వ్యవస్థాపక అధ్యక్షుడు బోగెల ఉమాకవి చేతుల మీదుగా మోటూరి నారాయణరావు లేఖ సాహిత్య సేవారత్న అవార్డును అందుకున్నారు.

ఈ సందర్భంగా కవి, జర్నలిస్ట్ మోటూరి నారాయణరావు మాట్లాడుతూ.. రెండున్నర దశాబ్దాల పాత్రికేయ జీవితంలోనూ, సాహిత్య , సామాజిక సేవలు చేయటంలోనూ తనకు ఆత్మ సంతృప్తి ఉందన్నారు. కలం కేవలం కాసుల కోసమే కాకుండా సమాజాన్ని చైతన్యవంతం చేయటానికి ఉపయోగపడాలన్నారు. తెలుగు వెలుగు సాహిత్య వేదిక, శేరిలింగంపల్లి రచయితల సంఘం, ఎస్ వీ ఫౌండేషన్ వంటి సామాజిక, సాహిత్య సంస్థల ద్వారా చేసిన సేవలకు గుర్తింపుగా తానా వంటి సంస్థలు, లేఖ పత్రిక వంటి సంస్థల ద్వారా సాహిత్య సేవా రత్న అవార్డును అందుకోవడం సుకృతంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. తన సాహిత్య సేవలకు గుర్తింపుగా సాహిత్య సేవా రత్న అవార్డును అందించిన లేఖ టీం కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.





