శేరిలింగంపల్లి, డిసెంబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని గోపినగర్ లో స్థానిక పేద ప్రజల అభ్యున్నతికి బాటలు వేస్తూ.. మాజీ స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత నాగేందర్ యాదవ్ తన సొంత ఖర్చులతో నిర్మించిన అంబేద్కర్ భవనంలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి తన సొంత ఖర్చులతో అంబేద్కర్ భవన్ జనచైతన్య అసోసియేషన్ కమిటీ, గోపినగర్ బీసీ హాస్టల్ విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్ లను (ఆట వస్తువులను) పంపిణీ చేశారు. కార్పొరేటర్ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలు, చదువు రెండింటికీ ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలని అన్నారు. నిరంతరం శ్రమిస్తే విజయం ఉందని తెలిపారు. ఇవి శారీరక దృఢత్వాన్ని, మానసిక ఉల్లాసాన్ని పెంచడమే కాకుండా, జట్టుగా పనిచేయడం క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఓటమిని అంగీకరించి గెలుపు కోసం ప్రయత్నించే తత్వాన్ని నేర్పుతాయని అన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు తన వంతు సహకారంగా స్పోర్ట్స్ కిట్స్ ను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు యాదా గౌడ్, విష్ణు వర్ధన్ రెడ్డి, గఫుర్, గోపినగర్ బస్తీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, లింగంపల్లి విలేజ్ ప్రెసిడెంట్ రవి యాదవ్, బీసీ హాస్టల్ వార్డెన్ సమీర్, అంబేద్కర్ భవన్ జనచైతన్య అసోసియేషన్ ప్రెసిడెంట్ రమేష్, వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్, జనరల్ సెక్రటరీ సత్యనారాయణ, సలహాదారులు నరసింహ, ముసలయ్య, ట్రెజరర్ సందీప్, జాయింట్ సెక్రటరీ పి ప్రవీణ్, వెంకటేష్, దస్తగిర్, సైదులు యాదవ్, ఆనంద్, ఏజాజ్, యేసు, గండయ్య, సాయినాథ్, సందీప్, రాములు, తుకారామ్, దేవప్రసాద్, మహిళలు, స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.





