శేరిలింగంపల్లి, డిసెంబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీలో పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై మయూరి నగర్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కాలనీ వాసులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీలో పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై కాలనీ అసోసియేషన్ సభ్యులతో కలసి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగిందని, తనదృష్టికి తీసుకువచ్చిన సమస్యలను, అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, పీఏసీ చైర్మెన్ ఆరెకపూడి గాంధీ సహకారంతో కాలనీలో నెలకొన్న వివిధ సమస్యలను దశలవారిగా పరిష్కరిస్తామని, కాలనీలో అసంపూర్తిగా మిగిలి పోయిన యూజీడీ పనులను, సీసీరోడ్ల నిర్మాణ పనులను త్వరి తగతిన పూర్తిచేస్తామని, మంజీర తాగునీటి వసతిని మెరుగుపరుస్తామని తెలిపారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు కే రామరాజు, మయూరి నగర్ సంక్షేమ సంఘం సభ్యులు హరికృష్ణ, కిషోర్, ప్రవీణ్ రెడ్డి, జంగీర్, సోమేశ్వర్ రెడ్డి, రమణ రెడ్డి, నాగరాజు, గోపాల్ రెడ్డి, వేణు, చిరంజీవి రాజు, వినోద్, బాషా, వెంకట్రమి రెడ్డి, విష్ణు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






