ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ ఏ పార్టీలో ఉన్నారో చెప్పే దమ్ము ఉందా: రవీందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కాంగ్రెస్ ప్రభుత్వంపై శేరిలింగంపల్లి యువ నేత, భారాస సీనియర్ లీడర్ రవీందర్ యాదవ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగంను పట్టుకొని తిరుగుతారని, రాజ్యాంగ స్ఫూర్తి అని చెబుతారని, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే చూస్తూ ఊరుకోవడం ద్వంద్వ‌ నీతికి పరాకాష్ట అన్నారు. ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని తెలిపారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ లపై స్పీకర్ తీర్పుపై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత రవీందర్ యాదవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం స్థానిక నేతలతో కలిసి సమావేశం అయ్యారు. భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై పోరాడుతామన్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారారని రాష్ట్రంలోని ఏ ఒక్కరిని అడిగినా చెబుతారన్నారు.

శేరిలింగంపల్లిలో భారాస నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరింది వాస్తవం కాదా..? అని ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీని ప్రశ్నించారు. దమ్ముంటే ఏ పార్టీలో ఉన్నారో ప్రజలకు చెప్పాలని సవాల్ చేశారు. భారాసలో ఉన్నట్లుగా చెప్పుకునే ధైర్యం ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీకి ఉందా..? అని మండిపడ్డారు. ప్రజలు పిచ్చోళ్లు కాదని, అన్నీ గమనిస్తున్నారని వెల్లడించారు. శేరిలింగంపల్లిలో ఆరెక‌పూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరింది నిజామా..? కాదా..? చెప్పాలన్నారు. పార్టీలు మారే ఊసరవెల్లు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రవీందర్ యాదవ్ సూచించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజా పోరాటాలు చేస్తామని, రానుంది భారాస ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి మాజీ ప్రధానకార్యదర్శి గంగారాం సంగారెడ్డి, నియోజకవర్గం బిఆర్ ఎస్ పార్టీ బిసి నాయకులు ముద్దంగుల మల్లేష్, యువజన నాయకులు గణేష్ రెడ్డి, విద్యార్థి నాయకులు రాజు యామలవలస, వసంత్ నాయుడు, నవీన్ రెడ్డి, పవన్ యాదవ్, కోటేష్, జస్వంత్, వరుణ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here