ట్రాఫిక్ రహిత సమాజం కోసం రాజీ లేని కృషి చేస్తాం: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉషాముళ్ళపూడి కమాన్ నుండి గాజులరామారం వరకు చేపడుతున్న వయా ఎల్లమ్మబండ ప్రధాన రహదారి 100 ఫీట్ రోడ్డు విస్తరణ పనులను కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఉషాముళ్ళపూడి కమాన్ నుండి గాజుల రామారం వెళ్లే రోడ్డు వయా ఎల్లమ్మబండ రోడ్డులో నిత్యం ట్రాఫిక్ సమస్య తో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నార‌ని , ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి 100 ఫీట్ రోడ్డు విస్తరణ చేపట్టడం జరిగింద‌ని అన్నారు. అందులో భాగంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు, కార్పొరేటర్ తో కలిసి చ‌ర్చించామ‌ని తెలిపారు. 100 ఫీట్ రోడ్డు విస్తరణలో ఉన్న అడ్డంకులను తొలగిస్తూ తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి, ప్రణాళికను రూపొందించి రోడ్డు విస్తరణ పనులు వెంటనే చేపట్టి త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here