అత్యవసరం ఉన్న చోట ప్రథమ ప్రాధాన్యతగా పనులు పూర్తి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని సురభి కాలనీలో రూ.24 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(UGD) పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్, జలమండలి అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజి సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం అని అన్నారు. పలు కాలనీలలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు, త‌మ‌ కార్పొరేటర్లు, త‌మ‌ దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణన‌లోకి తీసుకొని ప్రత్యేక చొరవతో సురభి కాలనీలో UGD నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. అత్యవసరం ఉన్న చోట, నిత్యం పొంగుతున్న ప్రాంతాలలో ప్రథమ ప్రాధాన్యతగా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఏ చిన్న సమస్య అయినా త‌న‌ దృష్టికి తీసుకువ‌స్తే తప్పకుండా పరిష్కరిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు జనరల్ మేనేజర్ ఆర్ కృష్ణ, డీజిఎం నరేందర్, మేనేజర్ అభిషేక్ రెడ్డి, జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం ఏఈ భాస్కర్, డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్, గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, వార్డు మెంబర్ శ్రీకళ వెంకటేశ్వర్లు, వార్డు మెంబర్ రాంబాబు, కొయ్యడ లక్ష్మణ్ యాదవ్, సీనియర్ నాయకుడు చాంద్ పాషా, సురభి కాలనీవాసుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ ఆర్ వెంకట్ రెడ్డి, సెక్రటరీ సి.వి.భాను, వైస్ ప్రెసిడెంట్ ఎస్ ఏ జయకృష్ణ, జాయింట్ సెక్రెటరీ జితేందర్ రెడ్డి, సలహాదారు చంద్రశేఖర్, ఆర్ కోదండరావు, యోగి, లింగారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మల్లేష్, సుబ్బు, సిద్దు, ఆర్ భాస్కర్, ఆర్ కమలాకర్, ఆర్ శ్రీనివాస్, కుమార్, యామిని, కుమార్, జమున రాయల్, అలీం, జిహెచ్ఎంసీ సిబ్బంది, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here