విద్యార్థుల‌కు విద్య‌ చాలా అవసరం: మాజీ శాసన సభ్యుడు భిక్షపతి యాదవ్

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందా నగర్ డివిజన్ సరస్వతి విద్యామందిర్ పాఠశాలలో సుమారు 500 మంది విద్యార్థిని విద్యార్థులకు సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా నోట్ బుక్స్ ను మాజీ శాసన సభ్యుడు భిక్షపతి యాదవ్, బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే మంచిగా చదువుకుంటే ఈ పోటీ ప్రపంచంలో అన్నింటిని ధైర్యంగా ఎదుర్కొని ఉన్నత శిఖరాలకు బాటలు వేసుకోగలమన్నారు. రానున్నది ఏఐ ప్రపంచమని మన భవిష్యత్తును ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా చూసుకోవాలంటే ఇప్పటి నుండే ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా విని చదువుకోవాలని, క్రమశిక్షణతో మెలగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రఘునాథ్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, బుచ్చిరెడ్డి, అనంత రెడ్డి, ఎల్లేష్, వసంత్ యాదవ్, రామచంద్ర రెడ్డి, నరేందర్ , ప్రసాద్, రమణయ్య, శ్రీనివాస్ , రామ్ రెడ్డి, గణేష్, శ్రీనివాస్, పద్మ, రాము పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here