అడ్డగోలుగా డివిజన్ల విభజన ప్రక్రియ: ర‌వికుమార్ యాద‌వ్

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): జీహెచ్ఎంసీ పరిధిలోకి పలు డివిజన్ల కలుపుతూ ఉన్న డివిజన్లు విభజిస్తూ ఇష్టారీతిగా 300 డివిజన్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం విభజించింద‌ని బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. జనాభా ప్రాతిపదికన విభజించారా లేక‌ ఓటర్ల జాబితా ప్రకారం విభజించారా, ఏ ప్రాతిపదికన విభజించారో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంద‌న్నారు. గత కొన్ని రోజుల క్రితం ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రాంతాలను జీహెచ్ఎంసీ పరిధిలోని తీసుకువస్తూ ఉన్న డివిజన్లు విభజిస్తూ ఇష్టారీతిగా 300 డివిజన్లు విభజిస్తూ డివిజన్ల సరిహద్దులను ప్రకటిస్తూ ఇచ్చిన జీవో పై అభ్యంతరాలను తెలుపుతూ శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ హేమంత్, మాజీ శాసనసభ్యుడు , బీజేపీ తెలంగాణ డెలిమిటేషన్ మానిటరింగ్ కమిటీ కన్వీనర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావుకి శేరిలింగంపల్లి బీజేపీ నాయకులతో కలిసి ర‌వికుమార్ యాద‌వ్‌ వినతి పత్రం అందజేశారు.

ఈ సంద‌ర్భంగా ర‌వికుమార్ యాద‌వ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా అని అడ్డగోలుగా డివిజన్లను విభజించడం సరైన పద్ధతి కాదన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ విభజనలో దాదాపు 70,000 ఓటర్లు అలాగే ఉన్నారన్నారు. మసీద్ బండ డివిజన్ 12 బూత్‌లకే పరిమితమైందని, శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ, రాజీవ్ గృహ కల్ప, ఆరంభ టౌన్ షిప్ , సందయ్య నగర్, సురభి కాలనీ నుండి గోపి చెరువు నాలా మీద నుండి చాకలి చెరువు నాలా మీదుగా అరబిందో గ్రేటర్ కమ్యూనిటీలను మసీద్ బండ డివిజన్ లో కలపాలని అన్నారు. బికే ఎన్‌క్లేవ్ డివిజన్ ను మక్త గ్రామస్థుల కోరిక మేరకు మక్త మహబూబ్ పేట్ డివిజన్ గా మార్చాలని కోరారు. మాతృ శ్రీ నగర్ డివిజన్ సరిహద్దుల ఏర్పాటు కూడా గందరగోళంగా ఉందన్నారు. అసలు ఈ డివిజన్ల విభజన ప్రక్రియ జనాభా ప్రాతిపదికన విభజించారా లేక‌ ఓటర్ల జాబితా ప్రకారం విభజించారా , ఏ ప్రాతిపదికన విభజించారో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి, బుచ్చి రెడ్డి, కంటెస్టేడ్ కార్పొరేటర్ ఎల్లేష్, సీనియర్ నాయకులు వసంత్ యాదవ్, ఆంజనేయులు సాగర్, గణేష్ ముదిరాజ్, పట్టాభిరామ్, పద్మ, శ్రీనివాస్, రవి నాయక్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here