శేరిలింగంపల్లి, డిసెంబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): ఆక్స్‌ఫర్డ్ స్కూల్ బీహెచ్ఎల్, కూకట్ పల్లి బ్రాంచ్ లు సంయుక్తంగా క్రీడా ఉత్సవాలు నిర్వహించారు. 27 సంవత్సరాలుగా క్రీడా ఉత్సవాలను నిర్వహిస్తున్నామని ఆర్ఐ ఆరోగ్య రెడ్డి తెలిపారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా సైబరాబాద్ సిటీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కాజా వాసుద్దీన్ హాజరయ్యారు. ఈ క్రీడలలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. 200 మీటర్, 500 మీటర్స్, లాంగ్ జంప్, హై జంప్, కోకో, కబడ్డీ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలుర విభాగంలో విజేతగా నిలిచిన అర్పాన్, విష్ణువర్ధన్ రెడ్డి, తాహిర్, బాలికల విభాగంలో విజేతలుగా నిలిచిన సోహ, శ్రీలక్ష్మి, నిహారికలకు ఆక్స్ఫర్డ్ స్కూల్ తరఫున షీల్డ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆక్స్ఫర్డ్ స్కూల్ బిహెచ్ఎల్ బ్రాంచ్ ప్రిన్సిపల్ మాలిని, కూకట్పల్లి బ్రాంచ్ ప్రిన్సిపాల్ అనురాధ, ప్రశాంతి, నర్సిన్, వరలక్ష్మి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.






