MA నగర్ కాలనీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి: కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 12 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని MA నగర్ కాలనీ వాసులు కాలనీలోని పలు సమస్యలు, చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనులపై మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని మర్యాద పూర్వకంగా క‌లిశారు. దీనిపై కార్పొరేటర్ శ్రీకాంత్ సానుకూలంగా స్పందించారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ M A నగర్ కాలనీ వాసులు కాలనీలోని పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై తమను మర్యాదపూర్వకంగా కలిశార‌ని, త‌మ‌ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలపై కాలనీలో స్వయంగా పర్యటించి పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. M A నగర్ కాలనీలో మౌళిక వసతులు కల్పించడమే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. కాలనీ ప్రజలకు అందుబాటులో ఉంటూ రోడ్లు, డ్రైనేజి, మంచినీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు కోడిపాక రాజు గౌడ్, దూలం రాజు గౌడ్, శివ ముదిరాజ్, విజయ, సంతోష్, కృష్ణ, జంగం మల్లేష్, శివ, బాలు యాదవ్, వడ్ల శివ చారి, వెంకటేష్, అనిల్ రెడ్డి, చంద్ర శేఖర్, సిద్ధూ, వినోద్, చందు, సుమో రాజు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here