శేరిలింగంపల్లి, డిసెంబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్ కేంద్రంగా స్థాపితమైన రిసోనెన్స్ పాఠశాలలకు ఎటువంటి అనుమతులు లేవని ఆ సంస్థ ఈ నెల 14న నిర్వహిస్తున్న రెసోఫాస్ట్ పరీక్షలకు ఎటువంటి అనుమతులు లేవని విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కావొద్దని బిజెపి యువనేత రాగిరి సాయిరాం గౌడ్ తెలిపారు. వనస్థలిపురం, మాదాపూర్, శేరిలింగంపల్లి, మణికొండ, గచ్చిబౌలి బ్రాంచులలో విద్యా శాఖ అనుమతులు లేకుండా ఈ పరీక్షలు నిర్వహిస్తున్న రిసోనెన్స్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారిని ఆయన డిమాండ్ చేశారు.






