రాయదుర్గంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఏర్పాటుకు కృషి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 12 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఏర్పాటుకు రూ.15 ల‌క్ష‌ల అంచనా వ్యయంతో SDF FUNDS నిధులతో నిర్మించడానికి గాను నిధుల మంజూరు కోసం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి పంపిన మంజూరు పత్రాలను రాయదుర్గం కాలనీ అసోసియేషన్ సభ్యులకు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ రాయదుర్గం కాలనీలో అభివృద్ధిలో భాగంగా కాలనీ అసోసియేషన్ సభ్యుల విజ్ఞప్తి మేరకు కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం SDF ఫండ్స్ ద్వారా మొత్తం రూ.15 లక్షల ఎమ్మెల్యే SDF FUNDS నుండి మంజూరు చేయవలసిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి ప్రతిపాదనలు పంపడం జరిగింద‌ని తెలిపారు. నిధులు మంజూరు కాగానే కమ్యూనిటీ హాల్ ను త్వరితగతిన నిర్మాణ పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, చిన్న చిన్న సమావేశాలు, సభలు, ఫంక్షన్ లు నిర్వహించుకునేందుకు వీలుగా కమ్యూనిటీ హాల్ ను నిర్మించేందుకు  సంతోషంగా ఉందన్నారు. రాయదుర్గం కాలనీ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తానని , మరిన్ని నిధులు కేటాయించడానికి సిద్ధం అని , ఏ చిన్న సమస్య వచ్చినా తన దృష్టికి వచ్చినా పరిష్కరిస్తానని PAC చైర్మన్ గాంధీ తెలియజేశారు. అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకుడు గణేష్ ముదిరాజు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here