శేరిలింగంపల్లి, డిసెంబర్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శంషీగూడలో ఉన్న ఫుల్ గాస్పెల్ చర్చి లో నిర్వహించిన సెమీక్రిస్మస్ వేడుకలలో పాస్టర్ల తో కలిసిPAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ క్రిస్మస్ కేక్ ను కట్ చేసి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఫుల్ గాస్పెల్ చర్చి లో పాస్టర్ ఇజ్రాయిల్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. డివిజన్ పరిధిలోని పాస్టర్ల అందరి మధ్యలో కేక్ కట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. శాంతి, నీతి, ప్రేమ, దయ కరుణలతో ప్రపంచానికి కొత్త మార్గం నిర్దేశించిన క్రీస్తు జన్మదినం సందర్భంగా క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రైస్తవులందరికి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ సత్యరాజు తదితరులు పాల్గొన్నారు.






