శేరిలింగంపల్లి, డిసెంబర్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): గత రెండు మూడు నెలలుగా హఫీజ్‌పేట డివిజన్ పరిధిలోని హఫీజ్‌పేట గ్రామంలో పారిశుద్ధ్య సిబ్బంది సరిగ్గా విధులు నిర్వహించడం లేదని, దీని కారణంగా రహదారులపై ఎక్కడి చెత్త, దుమ్ము అక్కడే ఉంటున్నాయని, దీని వల్ల ప్రజలు తీవ్ర దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ చందానగర్ సర్కిల్ డీసీ శశిరేఖకు శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు మిద్దెల మల్లారెడ్డి, పార్టీ నాయకుడు నిమ్మల రామకృష్ణ గౌడ్ ఫిర్యాదు చేశారు. చెత్త, దుమ్మును తొలగించకపోవడం వల్ల దుర్వాసనతో సతమతం అవడమే కాకుండా ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని, కనుక వెంటనే సమస్యను పరిష్కరించాలని వారు డీసీని కోరారు. దీనికి సంబంధించిన డీసీ శశిరేఖ వెంటనే సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.






