శేరిలింగంపల్లి, డిసెంబర్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): ఇగ్నైట్ విద్యా సంస్థలు, అవంతిక కన్స్ట్రక్షన్స్ సంయుక్త ఆధ్వర్యంలో జగన్ ఫిట్నెస్ స్టూడియో సౌజన్యంతో హైదరాబాద్ గచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణంలో 2026 జనవరి 4 ఆదివారం ఉదయం 5 గంటలకు నిర్వహించే స్వచ్ఛ హైదరాబాద్ రన్ కు సంబంధించిన పోస్టర్ ను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ గచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణంలో 3k , 5K ఫన్ రన్, 2k, 5k,10K టైమ్డ్ రన్ నిర్వహించడం జరుగుతుందని, పరిసరాల పరిశుభ్రతచ స్వచ్ఛత వంటి అంశాలపై ఈ రన్ నిర్వహించటం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. ప్రజలందరూ ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించి వీటిలో పాల్గొనాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇగ్నైట్ విద్యాసంస్థల చైర్మన్ రమేష్, అవంతిక కన్స్ట్రక్షన్స్ అధినేత శ్రీనివాస రెడ్డి, జగన్ ఫిట్నెస్ స్టూడియో నిర్వాహకుడు జగన్మోహన్ రెడ్డి, నాయకుడు సంజీవ రెడ్డి పాల్గొన్నారు.






