శేరిలింగంపల్లి, డిసెంబర్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): తెల్లాపూర్ బీసీ సంఘం ఆధ్వర్యంలో మాజీ ఉపసర్పంచ్ కృష్ణ అధ్యక్షతన తెల్లాపూర్ గద్దర్ సర్కిల్ వద్ద సాయి ఈశ్వర చారి చిత్రపటానికి బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈశ్వర చారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. తరతరాలుగా అన్ని పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయని అన్నారు. 33% ఉన్న బీసీ రిజర్వేషన్లను కేసీఆర్ ప్రభుత్వం 22 శాతానికి పరిమితం చేసిందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి కూడా 17% రిజర్వేషన్ కల్పించడం దారుణమైన చర్య అని అన్నారు. బీసీలను వెనుకబాటుకు గురిచేస్తున్న అన్ని పార్టీలను తరిమికొట్టి బీసీల రాజ్యాధికారాన్ని బీసీల ఐక్యమత్యాన్ని నిలుపుకోవాలని, బీసీల హక్కులను కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ కృష్ణ, తెల్లాపూర్ మాజీ సర్పంచ్ పి కుమార్ గౌడ్, బీసీ రాష్ట్ర నాయకుడు వడ్డే నర్సింహులు, మాజీ కౌన్సిలర్లు భరత్, శ్రీశైలం, ఐలేష్ యాదవ్, నాయకులు చిలకమర్రి ప్రభాకర్ రెడ్డి, మల్లె పల్లి బుచ్చిరెడ్డి, ఎల్ రవీందర్, సంగారెడ్డి జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు శ్రీశైలం చారి, తలారి బలరాం, పాటి మీది పాండు, వడ్డే శ్రీనివాస్, తూర్పు శ్రీనివాస్, బీసీ ఫేడరేషన్ ఆర్కే సాయన్న ముదిరాజ్, సీనియర్, విశ్వకర్మ సంఘం అధ్యక్షుడు కృష్ణమూర్తి చారి, ఆర్ సి పురం యాదవ్ సంఘం అధ్యక్షుడు రాగం రమేష్ యాదవ్, జర్నలిస్ట్ కృష్ణ, నర్సింగ్ ముదిరాజ్, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే వంగూరు శ్రీనివాస్ యాదవ్, విజయలక్ష్మి, బీసీ రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీ హరికృష్ణ చారి, అందాల కుమార్ యాదవ్, శివా యాదవ్, గణేష్ యాదవ్ పాల్గొన్నారు.






