శేరిలింగంపల్లి, డిసెంబర్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి మండలం పరిధిలోని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, హఫీజ్పేట్, చందానగర్ , భారతి నగర్(పార్ట్) డివిజన్ల పరిధిలోని పలువురికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా మంజూరైన రూ.30,03,480 ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ చెక్కుల రూపేణా అందజేశారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని, పేదింటి ఆడ బిడ్డకు పెద్ద అన్న లాగా నిలుస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగాధర్, కాజా, ఖాసీం, లియాకత్, శ్రీనివాస్ రెడ్డి, ప్రసాద్, కార్యకర్తలు, లబ్ధిదారులు, మహిళలు పాల్గొన్నారు.






