శేరిలింగంపల్లి, డిసెంబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని ఇందిరా పార్క్ వద్ద జరగనున్న బీజేపీ మహా ధర్నా, ఛలో ఇందిరా పార్క్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ విజ్ఞప్తి చేశారు. గత రెండు సంవత్సరాల సీఎం రేవంత్ రెడ్డి ప్రజా వంచన పాలనపై, 6 గ్యారంటీలు అమలు చేయకుండా, కాల యాపన చేయడం, కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని పాలనపై జరుగుతున్న ఈ పోరాటంలో డివిజన్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.






