లింగంప‌ల్లి రైల్వే బ్రిడ్జి ఫ్లై ఓవ‌ర్ ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాలి: రవికుమార్ యాదవ్

శేరిలింగంపల్లి, న‌వంబ‌ర్ 28 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): లింగంపల్లి రైల్వే బ్రిడ్జిపై చేపట్టబోయే ఫ్లైఓవర్ పనులను గుల్మోహర్ పార్క్ టర్నింగ్ వద్ద నుండి లింగంపల్లి గ్రామంలోని పెట్రోల్ బంక్ వరకు పొడిగించి త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల‌ని బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. అంజయ్య నగర్ శ్మ‌శాన వాటికకు హద్దులు ఏర్పాటు చేసి, కనీస వసతులు కల్పించాల‌ని అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ హేమంత్ ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఇందుకు జ‌డ్‌సీ సానుకూలంగా స్పందిస్తూ త్వరగా ప‌నులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంత‌రం ర‌వికుమార్ యాద‌వ్ మాట్లాడుతూ లింగంపల్లి రైల్వే బ్రిడ్జిపై చేపట్టబోయే ఫ్లైఓవర్ పనులను గుల్మోహర్ పార్క్ టర్నింగ్ వద్ద నుండి లింగంపల్లి గ్రామంలోని పెట్రోల్ బంక్ వరకు పొడిగించి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. అంజయ్య నగర్ శ్మ‌శాన వాటికకు హద్దులు ఏర్పాటు చేసి, శుభ్రం చేసి, కనీస వసతులు కల్పించాలని కోరారు.

లింగంపల్లి డివిజన్ పరిధిలో రైల్వే బ్రిడ్జి కింద చిన్న వర్షానికి నీళ్ళు అధికంగా చేరి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఉండేవని, ఈ సమస్య పరిష్కారానికి రైల్వే బ్రిడ్జిపై సాంటా మరియా స్కూల్ వద్ద నుండి లింగంపల్లి గ్రామంలోని పెట్రోల్ బంక్ వరకు రూ.124 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశార‌ని, కానీ పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రజా ప్రయోజనార్థం గుల్మోహర్ పార్క్ టర్నింగ్ వద్ద నుండి లింగంపల్లి గ్రామంలోని పెట్రోల్ బంక్ వరకు రోడ్ విస్తరణ, ఫ్లైఓవర్ నిర్మాణ పనులు వీలైనంత త్వరగా చేపట్టి త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల‌న్నారు. భవిష్యత్తులో మరింతగా పెరగబోయే జనాభా, నిర్మాణాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లింగంపల్లి డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ ఎల్లేష్, మాజీ డివిజన్ అధ్యక్షుడు ఆంజనేయులు సాగర్, సీనియర్ నాయకులు రవి నాయక్, మన్యం కొండ సాగర్, ఆత్మారామ్, బీజేవైం అధ్యక్షుడు మహేష్, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here