శేరిలింగంపల్లి, నవంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని గఫూర్ నగర్ కాలనీలో గఫూర్ నగర్ కాలనీ జంక్షన్ నుండి దుర్గం చెరువు వరకు రూ.11 కోట్ల 55 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపడుతున్న (RCC బాక్స్ డ్రైన్ ) వరద నీటి కాలువ నిర్మాణం పనులను డీసీ ప్రశాంతితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని పరిశీలించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దానిలో భాగంగా నాలా విస్తరణ పనులు, ఆర్సీసీ బాక్స్ డ్రైన్ నిర్మాణం పనులు, RCC బెడ్, సైడ్ వాల్స్ నిర్మాణం, నాలా విస్తరణ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. నాలా విస్తరణ పనులకు అందరూ సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో SNDP అధికారులు DE ధీరజ్, నాయకులు గణేష్ ముదిరాజు, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, KV రావు, హరి కృష్ణ, స్థానిక కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






