కేశవ‌నగర్ లో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

శేరిలింగంపల్లి, న‌వంబ‌ర్ 28 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): పరిశుభ్రమైన వాతావరణంతో మాత్రమే ప్రశాంతమైన జీవనం సాధ్యమవుతుందని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యాధులను అధిగమించేందుకు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, జిహెచ్ఎంసి శానిటేషన్ సిబ్బంది, స్థానిక నేతలు, కార్యకర్తల‌తో కలిసి కేశవ నగర్ లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేశవ నగర్ శ్మ‌శాన వాటికలో డంప్ చేసిన చెత్తను తొలగించి రోడ్డుకు ఆనుకుని ఉన్న మట్టి కుప్పలను జేసీబీలతో లెవలింగ్ చేయించారు. అలాగే చెత్తాచెదారాన్ని శానిటేషన్ వర్కర్లతో శుభ్రం చేయించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. స్థానికులు అభ్యర్థించిన కొన్ని చిన్నపాటి సమస్యలను కూడా పరిష్కరించేలా సంబంధిత అధికారులకు కార్పొరేటర్ ఆదేశాలు జారీ చేశారు.

అనంతరం కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ వ్యాధుల వ్యాప్తి ఎక్కువగా అపరిశుభ్రమైన వాతావరణం వల్లే జరుగుతుంది. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. మన ఇళ్లు, మన వీధులు శుభ్రంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ముందుకు సాగుతుంద‌ని సూచించారు. రోడ్లు, నాలాలు, చెత్త నిల్వ ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసేలా శానిటేషన్ విభాగం క్రమం తప్పకుండా చర్యలు తీసుకోవాలని అధికారుల‌ను ఆదేశించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, చెత్తను వర్గీకరించి ఇవ్వాలని, ఇండ్ల ముందు వీధుల్లో చెత్త పారబోసే అలవాట్లను పూర్తిగా మానుకోవాలని కార్పొరేటర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి వారంలో ఒకరోజు పరిసరాల శుభ్రత దినంగా పాటించాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో ఏఎంఓహెచ్ శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ నాయకులు తిరుపతి, ఈశ్వర్, నగేష్, హనుమంతు రాజు, శ్రీను, యాదయ్య, గోవింద్, వెంకటేష్, శ్యామ్, లక్ష్మణ్, నరసింహ, బాబు, కుమార్, విజయ్, యాదయ్య, దేవరాజ్, కరుణాకర్, గణేష్, జిహెచ్ఎంసి శానిటేషన్ సిబ్బంది మల్లేష్, కేశవ నగర్ వాసులు, సీనియర్ నాయకులు, స్థానిక నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here