శేరిలింగంపల్లి, నవంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణలో నీలి విప్లవం వస్తుందని, మత్య్సకారుల ఆర్థికాభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని దుర్గం చెరువులో మత్స్య శాఖ రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ప్రభుత్వం తరపున 100 శాతం సబ్సిడీపై ఉచితంగా పంపిణీ చేసిన 1.50 లక్షల చేప పిల్లలను TSFCOF చైర్మన్ మెట్టు సాయి కుమార్, మత్స్య శాఖ రంగారెడ్డి జిల్లా డైరెక్టర్ ఖదీర్, డిప్యూటీ డైరెక్టర్ పూర్ణిమ, శేరిలింగంపల్లి డీసీ ప్రశాంతిలతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ చెరువులోకి వదిలారు. ఈ సందర్భంగా PAC ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ మత్స్య శాఖ రంగారెడ్డి జిల్లా ప్రభుత్వం తరపున ఉచితంగా 100 శాతం సబ్సిడీ పై పంపిణీ చేసిన చేప పిల్లలను దుర్గం చెరువులో విడుదల చేయడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా పంపిణీ చేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ మత్స్యకారులకు ఒక వరమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో మత్స్య సంపద పెరగడానికి ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. మత్స్యకారులకు రాయితీపై వాహనాలు, వలలు, తెప్పలు, ఇతర సామాగ్రిని సబ్సిడీ పై అందజేస్తున్నారని అన్నారు. నీలి విప్లవం సాధనలో భాగంగా నీలి తెలంగాణ సాధనకు ముందుకు అడుగులు వేయడానికి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. అందులో భాగంగా ఉచిత చేపలను పంపిణీ చేసి మత్స్య కారులను ఆదుకుంటామని అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, రాయదుర్గం ఫిషర్ మెన్ కో ఆపరేటివ్ ప్రెసిడెంట్ సురేందర్ కుమార్, సభ్యులు శ్రీశైలం, నరేందర్, అశోక్, సురేష్ , వీరాస్వామి, భిక్షపతి, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.






