శేరిలింగంపల్లి, నవంబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గచ్చిబౌలి స్టేడియంలో బడ్జెట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ శేరిలింగంపల్లి మండలం ఆధ్వర్యంలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్- 2025 కార్యక్రమంను MEO వెంకటయ్యతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ బడ్జెట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ శేరిలింగంపల్లి మండలం ఆధ్వర్యంలో క్రీడా మహోత్సవం (స్పోర్ట్స్ మీట్) నిర్వహించడం చాలా అభినందించదగ్గ విషయం అని, టగ్ ఆఫ్ వార్, త్రో బాల్, ఖో ఖో, క్రికెట్, రన్నింగ్ వంటి ఆటలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పిల్లలు చదువులతోపాటు, ఆటలు ఆడడం చాలా కీలకం అని, పిల్లలలో దాగిన సృజనాత్మకతను బయటకి వెలికి తీయడానికి ఎంతగానో తోడ్పడుతాయని అన్నారు. పిల్లలకు చదువుతోపాటు క్రీడలు ఎంతగానో ముఖ్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.






