రంగారెడ్డి జిల్లా యువతకు జాతీయ గౌరవం

  • యూనిటీ మార్చ్ కోసం రాజు శెట్టి కురుమ, అవినాష్ రెడ్డి ఎంపిక

శేరిలింగంప‌ల్లి, న‌వంబర్ 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): యువజన శక్తి, జాతీయ ఏకతను ప్రతిబింబించే ప్రతిష్టాత్మక యూనిటీ మార్చ్ కు రంగారెడ్డి జిల్లా నుంచి రాజు శెట్టి కురుమా, అవినాష్ రెడ్డి ఎంపికయ్యారు. ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వ యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. దేశం సంస్కృతి, సంప్రదాయ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ Unity in Diversity – ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ సందేశంతో ఈ యాత్ర చేపట్టబడుతోంది. ఈ ప్రతిష్టాత్మక మార్చ్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో జరుగనుంది. ఈ యాత్రకు మరింత ప్రతిష్టను తీసుకురావడానికి, పాల్గొనబోయే యువతతోపాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా భాగస్వామ్యం కానున్నారు. దీనివల్ల దేశ వ్యాప్తంగా యువతకు ఇది అరుదైన, జీవితాంతం గుర్తుండిపోయే అవకాశం అవుతుంది. రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తూ ఎంపికైన రాజు శెట్టి కురుమ, అవినాష్ రెడ్డి, ఈ అవకాశంపై ఆనందం వ్యక్తం చేస్తూ, జాతీయ ఏకత సందేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here