ఉచిత వైద్య శిబిరాల‌ను ప్ర‌జ‌లు స‌ద్వినియోగం చేసుకోవాలి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 24 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని లక్ష్మీ నగర్ కాలనీలో సీనియర్ నాయకుడు DSRK ప్రసాద్ ఆధ్వర్యంలో మెడికవర్ ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకులు మొవ్వా సత్యనారాయణ, రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ DSRK ప్రసాద్ ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్స్ సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం అని అన్నారు. ఇక్కడి పరిసర ప్రాంత పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంద‌ని అన్నారు. ఇందులో భాగంగా జనరల్ మెడిసిన్ సంబంధించిన వైద్యులు, స్త్రీల వైద్యులు, చిన్న పిల్లల వైద్యులు, ఎముకలకు సంబంధించిన వైద్యులు, చర్మ వైద్యులు, నేత్ర వైద్యులు, న్యూ రాలజిస్ట్, ENT వైద్యులు పాల్గొని ఉచిత వైద్య పరీక్షలతోపాటు మందులు కూడా ఉచితంగా అందించడం అభినందనీయం అని అన్నారు. పేద ప్రజలు ఈ ఉచిత వైద్య సేవ‌ల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌న్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here