శేరిలింగంపల్లి, నవంబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని చందానగర్‌కు చెందిన సాయినేత్ర ఫౌండేషన్ అంధులు ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా షిరిడి సాయిబాబా దర్శనం చేసుకున్నారు. లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి శనివారం షిరిడి బయల్దేరి వెళ్లిన వారు ఆదివారం బాబాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు అనిత రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా షిరిడి సాయిబాబాను దర్శించుకోవడం జరిగిందన్నారు. బాబా ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు వెల్లడించారు.






