శేరిలింగంపల్లి, నవంబర్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): హరిహర సుతుడు అయ్యప్ప స్వామి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. మాదాపూర్ డివిజన్ ఇజ్జత్ నగర్ హనుమాన్ ఆలయం వద్ద నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో రంగారెడ్డి అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడు రాధాకృష్ణ యాదవ్ , సీనియర్ నాయకుడు నరసింహ యాదవ్ తో కలిసి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి దీక్ష ద్వారా ఆపదలు తొలగి అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు చేకూరుతాయన్నారు. శరణంటూ ఆశ్రయించిన వారిని కాపాడే దైవం హరిహరసుతుడు అయ్యప్ప అని అన్నారు. స్వామి వారి పడిపూజ మహోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. 41 రోజులు మండలం పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో, ఎన్నో నియమాలతో నిర్వర్తించే ఈ అయ్యప్ప దీక్షను చేపట్టడం వలన ఆ స్వామి వారి కృపాకటాక్షాలు ఉంటాయని హరిహరసుతుడు అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలన్నారు.






