కమ్మ సంఘం సభ్యులు ఐక్యతగా ఉండాలి: PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ

శేరిలింగంపల్లి, న‌వంబ‌ర్ 16 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ మెట్రో స్టేషన్ వెనుక KPHB కమ్మసంఘ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన KPHB కమ్మ సంఘం కార్తీక మాస వన భోజన మహోత్సవం కార్యక్రమంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర రావు, TGIDC చైర్మన్ మువ్వా విజయ్ బాబు, కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, ప్రముఖులు, కమ్మసంఘం సభ్యులతో కలిసి PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన కార్తీక మాసం సందర్బంగా KPHB కమ్మ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వన భోజన మహోత్సవం కార్యక్రమంను నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, ఇది ఒక శుభపరిణామం అని, కమ్మ సంఘం సభ్యులు ఐక్యతగా ఉండాల‌ని అన్నారు. కమ్మ సంఘం సభ్యులు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో KPHB కమ్మసంఘం ప్రతినిధులు, సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here