సంతులిత, సమగ్ర అభివృద్దే లక్ష్యం: కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT హిల్స్ కాలనీ, ఇందిరా నగర్ కాలనీ వరకు నూతనంగా నిర్మించవలసిన సివరేజ్ లైన్ కోసం విద్యుత్, HMWSSB, GHMC ఇంజనీరింగ్ అధికారులతో కలసి జాయింట్ ఇన్స్పెక్షన్ లో కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ విద్యుత్, HMWSSB, GHMC ఇంజనీరింగ్ అధికారులతో కలసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింద‌ని, HT లైన్ కింద నుండి ఉన్నందున జాయింట్ ఇన్స్పెక్షన్ ద్వారా సమస్యను త్వరితగతిన పరిష్కరించి సివరేజ్ లైన్ పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించామని తెలిపారు. అలాగే ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, సంతులిత, సమగ్ర అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. ప్రజలు అందరూ కలిసి డివిజన్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు. డివిజన్ వాసులందరి సమిష్టి కృషితో ఆదర్శవంతమైన డివిజన్‌గా తీర్చిదిద్దుతామని కార్పొరేటర్ పేర్కొన్నారు. ఏ చిన్న సమస్య అయినా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని, డివిజన్ లో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా కృషి చేస్తామని ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో HMWSSB ఏఈ ప్రియాంక, సూపర్వైజర్ నరేంద్ర, ఎలక్ట్రికల్ ఏఈ దయానంద్, GHMC ఇంజనీరింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here