దేశిని చిన్న మల్లయ్యకు ఘ‌న నివాళి

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చిక్కడపల్లిలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కార్యాలయంలో ఛైర్మ‌న్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్ ఆధ్వర్యంలో దేశిని చిన్న మల్లయ్య 8వ వర్ధంతి సందర్భంగా ఘ‌నంగా నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ గీత‌ రచయిత అందెశ్రీ ఆకస్మిక మరణం చెందడం ప‌ట్ల ఆయ‌న‌కి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఛైర్మ‌న్ బాల్ రాజ్ గౌడ్, గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, బీసీ సమాఖ్య రాష్ట్ర అధ్య‌క్షుడు ఎస్ దుర్గయ్య గౌడ్, గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్లి కట్టె విజయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ సాయుధ‌ పోరాట యోధుడు, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సామాజిక ఉద్యమ నేత, గీత వృత్తి దారుల కోసం అహర్నిశలు శ్రమించిన పోరాటాల యోధుడి అడుగుజాడల్లో నడవాలని అన్నారు. ఆయ‌న ఆశయాల బాటలో నడుస్తూ ఆయ‌న‌ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా తెలంగాణ గేయ రచయిత, ఎన్నో రచనలు చేసి సమాజ హితం కోసం, సమాజంలో మార్పు కోసం బహుజన వాదం కోసం తన మాట పాట రచన ఆలోచన అన్నీ సమాజం కోసమే చేసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు అని, అందెశ్రీ జయంతి, వర్థంతి, దేశిని చిన్న మల్లయ్య వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతోపాటు వారి జీవిత చరిత్రల‌ను పాఠ్య పుస్తకాలలో చేర్చాలని రాష్ట్ర ప్ర‌భుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బీసీ జన సైన్యం రాష్ట్ర అధ్యక్షుడు సింగం నాగేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వెంకన్న గౌడ్, సీనియర్ బీసీ నాయకుడు గడ్డమీది విజయ్ కుమార్ గౌడ్, ఐలెని గౌడ్, నరేష్ , అనిల్, సత్తయ్య గౌడ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here