శేరిలింగంపల్లి, నవంబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సెవెన్ హిల్స్ రెస్టారెంట్ వద్ద పొంగి పొర్లుతున్న డ్రైనేజీ సమస్యను స్థానిక ట్రాఫిక్ పోలీసులు పరిష్కరించారు. సదరు రెస్టారెంట్ వద్ద డ్రైనేజీ పొంగి పొర్లుతుండడంతో పక్కనే ఉన్న రహదారిపై గుంతలు ఏర్పడ్డాయని దీంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో చందానగర్ శానిటరీ ఇన్ స్పెక్టర్‌కు సమాచారం అందించి జేసీబీ సహాయంతో గుంతలను పూడ్చడం జరిగిందని, దీని వల్ల ట్రాఫిక్ సజావుగా కొనసాగుతుందని తెలిపారు.

ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు..
మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మియాపూర్ ఎక్స్ రోడ్డు నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్‌కు వెళ్లే రోడ్డులో రహదారి పక్కన వెలసిన ఫుట్ పాత్ ఆక్రమణలను స్థానిక ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. ఫుట్ పాత్ ఆక్రమణలు చేస్తే కఠిన చర్యలు చేపడతామని, ట్రాఫిక్ సజావుగా కొనసాగేందుకు అందరూ సహకరించాలని పోలీసులు సూచించారు.






