శేరిలింగంపల్లి, నవంబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని శ్రీదేవి థియేటర్ రోడ్డులో ఉన్న సాయి రాఘవ అపార్ట్మెంట్స్ లో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర పద్మావతి అమ్మవార్ల కళ్యాణమహోత్సవం కార్యక్రమంలో సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, రఘునాథ్ రెడ్డి , నరేందర్ బల్లా, అపార్ట్మెంట్ వాసులు తదితరులు పాల్గొన్నారు.






