సీఎం రిలీఫ్ ఫండ్ స‌హాయం అంద‌జేత

శేరిలింగంపల్లి, న‌వంబ‌ర్ 9 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా 30 మంది లబ్ధిదారులకు CMRF ద్వారా మంజూరైన రూ.11,73,000 ఆర్థిక సహాయానికి సంబంధించిన CMRF చెక్కులను కార్పొరేటర్లు నార్నె శ్రీనివాస రావు, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి బాధిత కుటుంబాలకి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరం అని, ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు ఆసుపత్రిలో బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తూ ఆర్థిక సాయాన్ని అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రసాద్, సైదేశ్వర్, కావూరి అనిల్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here