కాల‌నీలు, బ‌స్తీల‌లో ప్ర‌థ‌మ ప్రాధాన్య‌త‌గా ప‌నుల పూర్తి: కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 30 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని రామ్ నరేష్ నగర్ కాలనీ లో రూ.50 లక్షల అంచనా వ్య‌యంతో నిర్మిస్తున్న సిసి రోడ్డు నిర్మాణ పనులను జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం, కాలనీ వాసులతో కలసి కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పరిశీలించారు. ఈ సందర్భంగా నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ రామ్ నరేష్ నగర్ కాలనీ రోడ్ నం.12 లో CC రోడ్ నిర్మాణ పనులను దగ్గరుండి పరిశీలించడం జరిగిందని, ప్రజలు కూడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా డిపార్ట్మెంట్ వారికి సహకరించాలని కోరారు. పలు కాలనీలలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు, త‌మ‌ దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణన‌లోకి తీసుకొని ప్రత్యేక చొరవ తో డివిజన్ లో అత్యవసరం ఉన్న చోట, నిత్యం సమస్యలతో ఉన్న ప్రాంతాలలో ప్రథమ ప్రాధాన్యతగా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఏ చిన్న సమస్య అయినా త‌న‌ దృష్టికి వస్తే తప్పకుండా పరిష్కరిస్తామని, కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ , కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళుతూ సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీ లు గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామ‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి వర్క్ ఇన్స్పెక్టర్లు మహదేవ్, దేవి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here