శేరిలింగంపల్లి, అక్టోబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని నెహ్రూ నగర్ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రం, బస్తీ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన పోలియో డ్రాప్స్ కార్యక్రమానికి గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ యువజన మాజీ ఉపాధ్యక్షుడు, శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకుడు మారబోయిన రవి యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రవి యాదవ్ మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యం, సురక్షిత భవిష్యత్తు కోసం రెండు చుక్కలే సరిపోతాయన్నారు. ఐదేళ్ల కన్నా తక్కువ వయస ఉన్న ప్రతి చిన్న పిల్లలు పోలియో డ్రాప్స్ పొందాలని అన్నారు. తల్లితండ్రులు తమ పిల్లల ఆరోగ్యంపై పట్టుదలగా ఉండాలని, అన్ని మెడికల్ క్యాంప్లలో పాల్గొని నిర్దిష్ట టీకాలను అందింపజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కే.ఎన్.రాములు, మల్లేష్ ముదిరాజ్, గడ్డం శ్రీనివాస్, వెంకటాచారి, సోమనాథ్, గంగాధర్ గౌడ్, శంకర్, సాయి నందన్ ముదిరాజ్, పవన్, వడ్డే శ్రీనివాస్, శ్రీకాంత్ యాదవ్, బాలరాజు, శ్రీశైలం యాదవ్, కె రాజు చారి, మున్నా, వెంకట్, నర్సింహా, రజాక్, రాజేశ్వరి స్థానిక అంగన్వాడీ సిబ్బంది, ఆరోగ్య శాఖ ప్రతినిధులు, నాయకులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.






