శేరిలింగంపల్లి, అక్టోబర్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రగతి నగర్ రోడ్డు నుండి నాగార్జున హోమ్స్ చౌరస్తా నిజాంపేట్ రోడ్డు వరకు ఉన్న 60 ఫీట్ల రోడ్డు లో భవనాల నిర్మానాలకు అనుమతులు ఇస్తున్నారు కానీ వెంకట ప్రణీత్ డెవలపర్స్ ప్రయివేట్ లిమిటెడ్ వారు మాత్రం వారికి 100 ఫీట్ల మాస్టర్ ప్లాన్ అని చూపించి G+37 ఫ్లోర్ల బహుళ అంతస్థుల నిర్మాణం కోసం అనుమతులు తీసుకోవడం జరిగిందని, వారి వ్యాపార లబ్ది కోసం స్వప్రయోజనాల కోసం అధికారులను, ప్రజలను తప్పుదోవ పట్టించి అక్రమ పద్దతిలో తీసుకున్న అనుమతులు వెంటనే రద్దు చేయాలని ఆదిత్య నగర్ కాలనీ వాసులు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆదిత్య నగర్, చుట్టుపక్కల కాలనీ వాసులు మాట్లాడుతూ ఎన్నో ఏండ్ల నుండి నివాసిస్తున్నాం అని, అప్పట్లో ప్రోవిడెంట్ ఫండ్ నుండి రుణాలు తీసుకొని ఇండ్ల ను నిర్మించుకున్నాం అని అందరికి 60 ఫీట్ల రోడ్డు అని చూపించి అనుమతులు ఇచ్చారు. కానీ వెంకట ప్రణీత్ డెవలపర్స్ ప్రయివేట్ లిమిటెడ్ వారు మాత్రం వారికి 100 ఫీట్ల మాస్టర్ ప్లాన్ అని చూపించి G+37 ఫ్లోర్ల బహుళ అంతస్థుల నిర్మాణం కోసం అనుమతులు ఇచ్చారు అని, దొడ్డిదారిన తెచ్చుకున్న ఈ పర్మిషన్ వెంటనే రద్దు చేయాలని, 60 ఫీట్ల రోడ్డు వరకు మాత్రమే భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని అన్నారు.

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రగతి నగర్ రోడ్డు నుండి నాగార్జున హోమ్స్ చౌరస్తా నిజాంపేట్ రోడ్డు వరకు ఉన్న 60 ఫీట్ల రోడ్డులో భవనాల నిర్మాణాలకు అనుమతులు మాత్రం ఉన్నాయి అని , దొడ్డి దారిన అనుమతులు తెచ్చుకొని బహుళ అంతస్థులు నిర్మిస్తున్న ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదు అని , ఆదిత్య నగర్, నాగార్జున హోమ్స్, చుట్టుపక్కల కాలనీల వాసుల వినతి మేరకు GHMC కమిషనర్ కి ప్రజావాణి లో ఫిర్యాదు చేయడం జరిగిందని, వెంకట ప్రణీత్ డెవలపర్స్ ప్రయివేట్ లిమిటెడ్ వారు మాత్రం 100 ఫీట్ల మాస్టర్ ప్లాన్ చూపించి G+ 37 ఫ్లోర్ల బహుళ అంతస్తుల నిర్మాణంకు అనుమతులు తీసుకోవడం జరిగిందని, వారి వ్యాపార లబ్ది కోసం , స్వప్రయోజనాల కోసం అధికారులను, ప్రజలను తప్పుదోవ పట్టించి అక్రమ పద్దతిలో తీసుకున్న అనుమతులను వెంటనే రద్దుచేయాలని తెలియచేస్తున్నాను అని అన్నారు.





