శేరిలింగంపల్లి, అక్టోబర్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): రాచెర్ల మండల పరిధిలోని అరవీటికోట గ్రామంలో నూతనంగా నిర్మించిన హనుమాన్, వినాయక ఆలయాల్లో నిర్వహించనున్న విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి గాను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షేక్ చాంద్‌పాషా విరాళం అందజేశారు. విశ్వ హిందు పరిషత్ ఏపీ అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డికి ఈ మేరకు ఆయన రూ.50వేల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా విరాళం ఇచ్చినందుకు గాను షేక్ చాంద్‌పాషాకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇస్మాయిల్, శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






