శేరిలింగంపల్లి, అక్టోబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన చలో బస్ భవన్ లో పాల్గొనేందుకు శేరిలింగంపల్లిలోని మదీనాగూడ నుంచి తరలివెళ్లేందుకు సిద్ధమైన సీనియర్ నాయకుడు వాలా హరీష్ రావుని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆయన వెంట ముద్దంగుల మల్లేష్, జనార్దన్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.






