శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని చందానగర్ గౌతమినగర్లో ఉన్న వేముకుంటలోని శ్రీ మహాశక్తి లలితా పోచమ్మ దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం లలితా సహస్రనామ సామూహిక కుంకుమార్చన నిర్వహించగా ఇందులో సుమారుగా 300 మంది మహిళలు పాల్గొన్నారు. అనంతరం సుమారుగా 1వేయి మంది భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డి, వరలక్ష్మి, కాలనీ అధ్యక్షుడు ప్రసాద్, కట్ల శేఖర్ రెడ్డి, కిషోర్ కుమార్ , శివ యాదవ్ , శ్రీకాంత్ రెడ్డి, గాంధీ చౌదరి, ముక్వేశ్వర్ రావు, సాంబశివరావు, దేవాలయ ట్రస్టీ గుర్రపు రవీందర్ రావు, విజయ లక్ష్మి, దేవాలయ అర్చకుడు నాగేశ్వర్ రావు, భక్తులు పాల్గొన్నారు.






