శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని శ్రీశ్రీశ్రీ తుల్జాభవాని అమ్మవారి ఆలయం, చందానగర్ లోని పలు అమ్మవారి మండపాలను దసరా నవరాత్రుల పర్వదిన శుభసందర్భాన్ని పురస్కరించుకుని పిఏసీ ఛైర్మెన్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీతో కలిసి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి ప్రజలందరికీ సుఖశాంతులను ఆయురారోగ్యాలను అందించాలని వేడుకున్నట్లుగా తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఎంతో ప్రసిద్ధి చెందిన తుల్జాభవాని అమ్మవారి ఆలయ పునరుద్దీకరణ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని అతి త్వరలో చేపట్టబోతున్నామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్, గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, ప్రవీణ్, శ్రీనివాస్ యాదవ్, వార్డ్ మెంబర్ కవిత గోపాల్ కృష్ణ, వార్డ్ మెంబర్ రాము, తుల్జాభవాని టెంపుల్ ఈఓ సత్య చంద్రా రెడ్డి, పవన్ గుప్తా, పాండు, SLVDC రవి యాదవ్, కృష్ణ, నటరాజ్, కిరణ్ యాదవ్, శేఖర్, సంపత్, మల్లేష్ యాదవ్, రాజశేఖర్ రెడ్డి, శ్రీనాథ్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






