అభివృద్ధి ప‌నుల‌ను స‌కాలంలో పూర్తి చేయాలి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ సర్కిల్ కార్యాలయంలో శేరిలింగంపల్లి సర్కిల్ ఉప కమిషనర్ శశిరేఖ, కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, GHMC ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ చందానగర్ సర్కిల్ పరిధిలోని చందానగర్, మాదాపూర్, హఫీజ్ పేట్, మియాపూర్ డివిజన్లలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల‌పై ఉప కమిషనర్ తో చర్చించడం జరిగింద‌న్నారు. పెండింగ్ లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని , అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని, అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి అధిక మొత్తంలో నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని, పనులలో వేగం పెంచాలని సకాలంలో నిధులు మంజూరు అయ్యేలా చూడాలని , అభివృద్ధి పనులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో GHMC విభాగం అధికారులు EE ఇంద్రబాయి, DE శ్రీదేవి, DE దుర్గాప్రసాద్, AE సంతోష్ రెడ్డి, AE సంతోష్, AE మన్యం టౌన్ ప్లానింగ్ ACP నాగిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here