పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమం

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పండిట్ దీన్ దయాళ్‌ ఆలోచనలు, ఆయన చేసిన సేవలు మనందరికీ స్ఫూర్తిదాయకమని, ఆయన చూపిన మార్గంలో సమాజం ముందుకు సాగాలని సేవా పక్షం కన్వీనర్, జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు గంగల రాధాకృష్ణ యాదవ్ అన్నారు. పండిట్ దీన్ దయాళ్‌ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా మాదాపూర్ డివిజన్ పరిధిలోని మాతృశ్రీ నగర్ లో ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి రాధాకృష్ణ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటడం కర్తవ్యంగా భావించాలని కోరారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన డివిజన్ సెక్రటరీ శ్రీగిరి సత్యనారాయణ, డివిజన్ ప్రెసిడెంట్ గోలి వేణుగోపాల్ రెడ్డి, సేవా పక్షం కన్వీనర్ మహేంద్ర యాదవ్, డివిజన్ సెక్రటరీ రాగిణి కిరణ్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్న శ్రీశైలం కురుమ, జిల్లా ఐ.టీ కో-కన్వీనర్ నాయిని ప్రవీణ్ కుమార్ రెడ్డి, డివిజన్ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు గురు యాదవ్, మురళి, ముకేశ్, పెండ్యాల రంజిత్ కుమార్, మహేష్ రవ్వ, అల్లాడి ప్రవీణ్, గోంగూలూరి ప్రవీణ్ రెడ్డి, కిరణ్ అంచురి, నరేంద్ర, మధుకర్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here