శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని చందానగర్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం డీసీ శశిరేఖ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పలు విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది స్వీకరించారు. టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో 7 ఫిర్యాదులు రాగా, హెల్త్ అండ్ శానిటేషన్ విభాగంలో 1, ఇంజినీరింగ్ వింగ్లో 6 ఫిర్యాదులు వచ్చాయి. రెవెన్యూ, యూసీడీ, యూబీడీ, ఎలక్ట్రికల్, ఇతర అన్ని విభాగాల్లో ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. మొత్తం అన్ని విభాగాల్లో కలిపి ప్రజా వాణిలో 14 ఫిర్యాదులు వచ్చాయని, వీటిని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని అధికారులు తెలిపారు.






