ఎంపీపీ స్కూల్ విద్యార్థుల‌కు డ్రాయింగ్ కాంపిటీషన్

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 20 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సేవా పక్షంలో భాగంగా భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదినం సంద‌ర్భంగా చందానగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాస్ రెడ్డి, క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో శివానగర్ లోని ఎంపీపీ స్కూల్ విద్యార్థుల‌కు డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించారు. ఇందులో 50 మంది చిన్నారులు పాల్గొన్నారు. వారికి నోట్ బుక్‌ల‌ను పంపిణీ చేశారు. అలాగే స‌మీపంలో ఉన్న అంగ‌న్ వాడీ స్కూల్‌ను వారు సంద‌ర్శించారు. ఆ స్కూల్‌లో దాదాపు రెండు సంవత్సరాల నుండి విద్యుత్‌ సమస్య ఉన్నదని తెలుసుకొని డీఈతో మాట్లాడి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని TAC మెంబర్ పోరెడ్డి బుచ్చిరెడ్డితో క‌లిసి కోరారు. ఇందుకు డీఈ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మాజీ అధ్యక్షుడు రాకేష్ దూబే, రాంరెడ్డి, డివిజన్ ప్రధాన కార్యదర్శి కృష్ణ కాంత్, అమరేందర్ సింగ్, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here