శ్రీ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవంలో పాల్గొన్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 17 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని పాపిరెడ్డి కాలనీ శ్రీ గాయత్రీ విశ్వకర్మ శివాలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ విశ్వకర్మ భగవానుని యజ్ఞమహోత్సవములో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఆలయ ఆవరణలో అసంపూర్తిగా ఉన్న కమిటీ హాల్ పనులను సంబంధిత అధికారులతో చర్చించి సాధ్యమైనంత త్వరలో ప్రారంభించి పూర్తిచేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గాయత్రి విశ్వకర్మ దేవాలయ కమిటీ అధ్యక్షురాలు రమాదేవి, గౌరవ అధ్యక్షుడు రాజేశ్వర చారి, ఫౌండ్రర్స్ రాజేష్ చారీ, బీష్మ చారీ, ఉపాధ్యక్షులు నరసింహ చారీ, ఆశా కుమారి, శ్రీకాంత్ చారీ, నాగాబ్రహ్మం, సలహాదారు నాగేశ్వర్ రావు, ప్రధాన కార్యదర్శి రాములు చారీ, సత్యనారాయణ, భరత్ కుమార్ చారీ, సాయికృష్ణ, కోటయ్య, కళ్యాణి, కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here