బీజేపీ అధికారంలోకి వ‌స్తే అధికారికంగా విమోచ‌న దినోత్స‌వం: కైతాపురం జితేందర్

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 17 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకొని హఫీజ్‌పేట్ డివిజన్ లోని హఫీజ్ పేట్ గ్రామం చౌరస్తాలో హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్, హుడా కాలనీలో బీజేపీ నాయకుడు సత్యనారాయణ రాజు జాతీయ జెండాల‌ను ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో , నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించక పోవడం తెలంగాణ ప్రజలను అవమానించడమే అని అన్నారు. బీఆర్ఎస్ , కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఎంఐఎం నాయకులకు వత్తాసు పలకడం, మైనారిటీ నాయకులకు భయపడి తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం లేద‌న్నారు. రాష్ట్రంలో రానున్న బీజేపీ ప్రభుత్వంలో తప్పక అధికారికంగా నిర్వహిస్తామ‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ సేవా పక్షం కన్వీనర్ , బీజేపీ జిల్లా మాజీ అధికార ప్రతినిధి అజిత్ సేనాపతి , బిజెపి సీనియర్ నాయకుడు రమణయ్య , డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు , ప్రసాద్ పాత్రో , ప్రధాన కార్యదర్శ రాజు , బీజేపీ నాయకులు సురేష్ , శ్రీనివాస్, నర్సింహ యాదవ్, రాజు యాదవ్, మహేష్ గౌడ్ , మల్లేష్ , రామచంద్ర యాదవ్, రామ్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here