శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్రానికి నూతనంగా బీజేవైఎం అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన కుండే గణేష్ సోమవారం రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ ని మసీదు బండ, కొండాపూర్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కలిసి తెలంగాణ రాష్ట్రంలో, నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని, బీజేవైఎం పటిష్టత కోసం కృషిచేస్తానని చెప్పారు. రానున్న జిహెచ్ఎంసి ఎన్నికలలో కాషాయ జెండా ఎగురవేసే విధంగా ముందుకు సాగాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17, ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా యువ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టనున్న నిషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా 3k నమో యువ రన్ పోస్టర్ ఆవిష్కరించారు.






