న‌డిగ‌డ్డ తండాలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను త్వ‌ర‌గా ప‌రిష్క‌రిస్తాం: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 15 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండాలో నెలకొన్న పలు సమస్యల పై స్వామి నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగారెడ్డి జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నిర్వహించిన సమావేశంలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, జాతీయ ఎస్టీ కమిషన్ డెరైక్టర్ కళ్యాణ్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి, కస్టోడియన్ ఎనిమి ప్రాపర్టీ డిప్యూటీ సెక్రటరీ ముంబాయి, సెక్రెటరీ అశోక్ కుమార్ , CRPF సెకండ్ కమాండెంట్ అమిత్ మిశ్రా, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి రామేశ్వరి దేవి, RDO వెంకట్ రెడ్డి, తహసీల్దార్ వెంకారెడ్డి, డీసీ శశిరేఖ, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ల‌తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా నడిగడ్డ తాండాలో పర్యటించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ నడిగడ్డ తాండా, సుభాష్ చంద్ర బోస్ నగర్, ఓంకార్ నగర్ కాలనీలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. నడిగడ్డ తండా , సుభాష్ చంద్రబోస్ నగర్, ఓం కార్ నగర్ లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించామని, రోడ్లు డ్రైనేజి, మంచి నీటి సరఫరా, బస్తీ దవాఖాన, వీధి దీపాలు మొదలైన‌ మౌలిక వసతులు కల్పించామని, అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడలేద‌ని అన్నారు. వారం రోజులలో సమగ్ర నివేదిక అందిన వెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో GHMC అధికారులు, ఎలక్ట్రికల్ , పారిశుధ్య విభాగం, తండా వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here